Paripoornananda swami autobiography samples

పరిపూర్ణానంద స్వామి

పరిపూర్ణానంద ఆధ్యాత్మిక గురువు. అతను శ్రీపీఠం వ్యవస్థాపకుడు.[1]

బాల్యం, విద్యాభ్యాసం

[మార్చు]

ఆయన నెల్లూరులో 1972 నవంబరు 1 న జన్మించాడు.[2] 14 సంవత్సరాల వయస్సులోనే, తల్లి కోరిక మేరకు వేద పాఠశాలలో వేదాధ్యయనం చేస్తూ సంతృప్తి చెందక, 16వ ఏట ఋషీకేశ్ చేరుకున్నాడు.

అచ్చట దయానంద సరస్వతి స్వామి వద్ద భారతీయ వాఙ్మయాలను, ఉపనిషత్ సిద్దాంతాలను, భాష్యాలను అధ్యయనం చేశాడు. వీటితో పాటు ఆగమ, మంత్ర, వాస్తు, జ్యోతిష్యములను కూడా వేరు వేరు గురువుల వద్ద అధ్యయనము చేసారు.[3]

శ్రీపీఠం ప్రతిష్టాపన

[మార్చు]

తన గురువు దయానంద స్వామి ఆజ్ఞ అనుసారం ఆంధ్ర రాష్ట్రం తన ప్రవచనముల ద్వారా వివిధ ప్రాంతాలను పర్యటిస్తూ 1999 సం.లో, తూర్పు గోదావరి జిల్లాకాకినాడ పట్టణంలో శ్రీపీఠంలో ఐశ్వర్యంబికా సమేత సుందరేశ్వర స్వామివారుల ప్రతిష్ఠను గావించారు.

కొన్ని సంవత్సరముల పాటు శ్రీపీఠం అభివృద్ధిలో నిమగ్నమై అచ్చటనే ఉంటూ ప్రవచనములను, శిక్షణ శిబిరాలను, సేవలను నిర్వహించాడు. ఆంధ్ర ప్రదేశ్ కరువు కాటకాలతో వర్షాలు లేక బాధపడుతున్న సమయంలో 2002 లో శ్రీపీఠంలో 32 రోజులపాటు మహానక్షత్రయాగాన్ని నిర్వహించాడు.

2003, 2004 సం.లో వరుసగా రాజమండ్రి గోదావరి పుష్కరాలలో 5 లక్షలమందికి, విజయవాడలో కృష్ణవేణి పుష్కరాలలో 6 లక్షలమందికి అన్నదానమును నిర్వహించాడు.

ఆస్తిక, నాస్తికులనే భేదం లేకుండగా కుల, వర్గ వయోభేదాలకతీతంగా యువతీ యువకులు చిన్నారులు సైతం శ్రీ వేంకటేశ్వర భక్తిఛానెల్ లో ఉదయం గం.7-00లకు ప్రసారమయ్యే పరిపూర్ణానంద స్వామి ప్రవచనాల ద్వారా హిందూ మత వ్యాప్తిలో కీలక పాత్ర పోషించాడు.[4][5]

హిందూధర్మ ప్రచారం

[మార్చు]

యువపధం

[మార్చు]

యువతీ యువకులను భారతీయ సనాతన ధర్మాలపట్ల ఆసక్తిని కలిగిస్తూ వ్యక్తిత్వ వికాసానికి, తోడ్పడే అంశాలను ప్రబోధిస్తూ వేలాదిమందికి చక్కటి మార్గదర్శకాలను అందిస్తున్నాడు.

మాతృదేవోభవ

[మార్చు]

మహిళలకు ధైర్యాన్ని, ఆత్మస్ధైర్యాన్ని కలిగించే అంశాలను, విషయాలను ప్రాచీన భారతీయ జీవన ప్రమాణాలతో కూడిన విలువలను బోధిస్తూ లక్షలాది మంది మాతృమూర్తులకు స్ఫూర్తిని కలిగిస్తున్నాడు[6].

అతిపిన్న వయస్సులోనే జ్ఞానయజ్ఞ ప్రవచనముల ద్వారా ఆంధ్రరాష్ట్రం నలుమూలలా అవిశ్రాంతంగా పర్యటిస్తూ హిందూధర్మాన్ని, భారతీయ వైభవాన్ని దిశదిశలా వ్యాపింపచేస్తున్నాడు.

జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని సమపాళ్ళలో మేళవించి అనేక భాషలలో కోట్లాదిమందిని చైతన్యపరుస్తున్నాడు.

ఇతని బోధనలన్నీ మత సామరస్యాన్ని పెంపొందించేవిగానే ఉంటాయి. "నీ ధర్మాన్ని నీవు రక్షించుకుంటూ పరధర్మాల్ని గౌరవించాలని" అంటాడు. ఆ తర్వాత భారతదేశంలో హైందవ ధర్మం పై దాడులు జరుగుతున్నాయని భావించి హిందూ ధర్మ సంరక్షణ కోసం నడుం బిగించాడు.

రాష్ట్రీయ హిందూ సేన

[మార్చు]

హిందూ రక్షా వేదిక అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం పీఠాన్ని శిష్యులకు అప్పచెప్పి, ఆయన ప్రజల్లోకి వచ్చి, హైందవ ధర్మం గురించి బోధించడం మొదలుపెట్టాడు. ఆయన బోధనలలో భగవద్గీత యువతీ యువకులను సైతం ఎంతో ప్రభావితం చేసింది. దేశంలో మతమార్పిడులు జరుగుతున్నాయని గ్రహించిన ఇతను వాటికి అడ్డుకట్ట వేసే దిశగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నాడు.

అందులో భాగంగానే హిందూ మనోరథ యాత్ర పేరిట రాష్ట్రంలో పర్యటించారు. ఇంకా పర్యటిస్తున్నాడు.

వివాదాలు

[మార్చు]

ఓ ఛానల్‌లో జరిగిన కార్యక్రమంలో శ్రీరాముడి గురించి కత్తి మహేష్ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో.. వాటిని నిరసిస్తూ స్వామి పరిపూర్ణానంద హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు ధర్మాగ్రహ యాత్రకు పూనుకున్నాడు. కాగా, ఈ యాత్రకు అనుమతి నిరాకరించిన పోలీసులు ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు.

మూడు రోజులుగా ఆయన గృహ నిర్బంధంలోనే ఉన్నాడు. 2017 నవంబరులో రాష్ట్రీయ హిందూసేన సమావేశంలో పరిపూర్ణానంద స్వామి చేసిన ప్రసంగంపై వచ్చిన ఫిర్యాదుల మేరకు నాటకీయ పరిణామాల మధ్య ఆయనకు ఆరునెలల పాటు నగర బహిష్కరణ చేసారు. ఆయన ఆరు నెలల పాటు నగరంలోకి ప్రవేశించకూదని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. కాని హై కోర్టు పోలీసు శాఖను మందలించి స్వామి పరిపుార్ణానంద మీద విధించిన నగర బహిష్కరణను ఎత్తివేసింది.

[7]

మూలాలు

[మార్చు]

Copyright ©browrust.aebest.edu.pl 2025